Header Banner

మరో రెండు రోజులు... ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు! విద్యుత్ అంతరాయం!

  Sun May 04, 2025 12:38        Others

ఏపీలో పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజులు కొనసాగుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల నేపథ్యంలో చెట్లకింద ఎవరూ ఉండవద్దని సూచించింది.

 

ఏపీ(AP)లో పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం (Gale and rain) సృష్టించింది. కృష్ణా జిల్లా (Krishna district)లో తీవ్ర ఎండలు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్న సమయంలొ వాతావరణం (weather)లో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. గన్నవరం రహదారి ప్రాంతంలో నల్లటి మేఘాలు ఒక్కసారిగా కమ్మేసాయి. భారీ ఈదురు గాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు (Electricity disruption). కృష్ణా జిల్లా, కంకిపాడులో ఈదులుగాలులకు పలు హోర్డింగ్‌లు, చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.

 

ఇది కూడా చదవండి: రేషన్ కార్డులు పొందాలంటే అది తప్పనిసరి! ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!

 

ఆందోళనలో మామిడి రైతులు

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రెడ్డిగూడెం, మైలవరం మండలంలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. గత మూడు రోజులుగా ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు, వర్షం పడుతుండటంతో ఉపశమనం పొందారు. కాగా ఈదురు గాలులు వీస్తుండటంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్‌లో వీచిన భారీ గాలులకు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మళ్లీ గాలులు వీస్తుండటంతో నష్టాలు తప్పవని రైతులు అంటున్నారు. దీంతో మైలవరం మార్కెట్ యార్డులో భారీగా మొక్కజొన్న నిల్వలు పేరుకుపోయాయి.

ఒక్కసారిగా మారిన వాతావరణం..

ఏలూరు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మెగావృతమైన ఆకాశం భారీ గాలితో కూడిన వర్షం పడింది. రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులకు కొంత ఉపసమనం కలిగింది. కోణసీమ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అమలాపురంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్సం పడింది. అకాలవర్షంతో మామిడి సహా పలు ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవడంతో పగలే చీకటిగా మారిపోయిన వాతావరణం పట్టపగలు సైతం వాహనాలు లైట్లు వేసుకుని వెళుతున్న పరిస్థితి నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజవర్గం తాళ్లపూడి చాగల్లు మండలంలో పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. నిడదవోలు మండలంలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసింది.


మరో రెండు రోజులు వర్షాలు…

ఏపీలోని భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరో రెండు రోజులు కొనసాగుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమ, మంగళవారం వరకు పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం,నె ల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పిడుగుల హెచ్చరికల నేపథ్యంలో చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించింది.

 

ఇది కూడా చదవండి:  జైలులో ఆ నోటి దూల మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi Heavy rains accompanied by gusty winds for the next two days